(ఎక్స్‌ప్రెస్ టుడే): విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు, విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆహ్వానించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కలిశారు.
విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించే దసరా ఉత్సవాలకు, విజయవాడ ఉత్సవ్ 2.0కు హాజరై ఉత్సవాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా వారు యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించారు.
