విజయవాడ, నవంబర్ 7 (ఎక్స్‌ప్రెస్ టుడే): దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సందేశం ఇలా ఉంది:

‘‘ఈ ఆనందకరమైన దీపావళి పండుగ పర్వదిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

దీపావళి దివ్య కాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తాయి. దీపావళి పండుగ చీకటిపై కాంతి, చెడుపై మంచి మరియు అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తుంది. దీపావళి వెలుగులు చీకటి ఆలోచనలను నాశనం చేసి, సమాజంలోని చెడును నిర్మూలిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకునే శక్తిని ఇంకా ఉత్సాహాన్ని ఇస్తాయి.

ఇలాంటి పండుగలు శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం మరియు మత సామరస్యంతో నిండిన సమాజాన్ని నిర్మించడానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.’’