షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూముల బదిలీని నిషేధించే 1/70 చట్టాన్ని సవరించే యోచన లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజనులను ఏళ్లుగా వెంటాడుతున్న ఈ సమస్యపై కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

గిరిజనుల భూ హక్కులకు రక్షణగా ఉన్న ఈ చట్టాన్ని యథాతథంగా కొనసాగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై గిరిజన సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో భూ యాజమాన్య హక్కుల పరిరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ అధికారులు తెలిపారు.