అమరావతి, అక్టోబర్ 3 (ఎక్స్ప్రెస్ టుడే): తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీసిటీలోని ఓ పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ పేలిన సమయంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోయారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు ఆయనకు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని వివరించారు.
మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
