తిరుమల, అక్టోబర్ 27 (ఎక్స్‌ప్రెస్ టుడే): నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • నవంబర్ 2వ తేదీన తిరుమల నంబి ఉత్సవారంభం.
  • నవంబర్ 4వ తేదీన శ్రీ మనవాళ మహామునుల ఉత్సవారంభం.
  • నవంబర్ 8వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.
  • నవంబర్ 11వ తేదీన తిరుమల నంబి శాత్తుమొర.
  • నవంబర్ 13వ తేదీన నాగుల చవితి, తిరుమల శ్రీవారి పెద్దశేష వాహనం, శ్రీమనవాళ మహామునుల శాత్తుమొర.
  • నవంబర్ 14వ తేదీన సేనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 15న శ్రీవారి పుష్ప యాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 16వ తేదీన శ్రీవారి పుష్ప యాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్లై లోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయ్ గై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 19వ తేదీన యాజ్ఞవల్క్య జయంతి.
  • నవంబర్ 21వ తేదీన కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి.
  • నవంబర్ 24వ తేదీన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.
  • నవంబర్ 25వ తేదీన తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.