తిరుమల, అక్టోబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి కమల అనే భక్తురాలు గురువారం తిరుమల శ్రీవారికి దాదాపు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను విరాళంగా అందించారు.

దాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి హారాలను అందజేశారు.