రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త విధానాలు, రాయితీలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ రంగం కీలక పాత్ర పోషిస్తుండటంతో, ఈ రంగానికి ఊతమిచ్చేలా ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
సులభతర రుణ సదుపాయాలు, సాంకేతిక సహకారంతో చిన్న పరిశ్రమలను బలోపేతం చేయనున్నట్లు పరిశ్రమల శాఖ తెలిపింది. తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడం, ముడిసరుకు సేకరణలో సహకారం అందించడం వంటి చర్యలపైనా దృష్టి సారించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ రంగం అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల వెంట చిన్న యూనిట్ల క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగానే ఉపాధి కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.
