మంగళగిరి, అక్టోబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శిక్షణా కార్యక్రమాలు, ఐటీడీపీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పార్టీ శ్రేణులకు నిరంతర శిక్షణ అందిస్తూ సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఐటీడీపీని సాంకేతికంగా మరింత బలోపేతం చేసి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో సమర్థవంతంగా తిప్పికొట్టేలా పార్టీ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

కార్యకర్తలను ‘మై టీడీపీ యాప్‌’తో అనుసంధానం చేసి పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పల్లా శ్రీనివాసరావు అన్నారు.