గాజువాక, అక్టోబర్ 1 (ఎక్స్ప్రెస్ టుడే): గాజువాక నియోజకవర్గంలో పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ప్రారంభించారు.
గాజువాక వార్డు నంబర్ 73 పరిధిలోని సింహగిరి కాలనీలో తలుపులమ్మ ఆలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.
