రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 27: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.
- నీటిమట్టం 8.50 అడుగుల వద్ద కొనసాగుతోంది
- బ్యారేజీ 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేత
- 5.60 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల
- సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం
ఆదివారం ఉదయం నాటికి ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 8.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. బ్యారేజీలోని 175 గేట్లను స్వల్పంగా ఎత్తి, 5.60 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ రోజు సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.