గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ)కు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

సచివాలయంలో జరిగిన ఈ భేటీలో 55కుపైగా అజెండా అంశాలపై చర్చించిన కేబినెట్, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలిపింది. 2026-27 జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు.

బీసీ జనాభాలో సగానికి పైగా ఉన్న రాష్ట్రంలో, గత ప్రభుత్వ హయాంలో కోల్పోయిన 16 వేలకుపైగా స్థానిక సంస్థల పదవులను తిరిగి బీసీలకు కల్పించే చారిత్రక నిర్ణయమిదని మంత్రులు అభివర్ణించారు.

శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనున్నాయని శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ ఇప్పటికే నిర్ణయించింది.