అనకాపల్లి, అక్టోబర్ 31 (ఎక్స్‌ప్రెస్ టుడే): అర్నబ్ తుఫాను కారణంగా ఏర్పడిన అంతరాయాలు, విద్యుత్ సరఫరాలో నిలిచిపోయిన పరిస్థితులు, మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్‌లోని తుఫాను ప్రభావిత 13 జిల్లాల్లో గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఓటీపీ ఆధారిత ధృవీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు.

నగదు చెల్లింపు ద్వారా నేరుగా సిలిండర్లను పొందే విధానాన్ని అమలు చేసేందుకు భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

అనకాపల్లి జిల్లాలోని తుఫాను ప్రభావిత గ్రామాల్లో గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఓటీపీ ఆధారిత ధృవీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు కల్పిస్తూ, నగదు చెల్లింపు ద్వారా నేరుగా సిలిండర్లను పొందే విధానాన్ని అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటంతో పాటు, వినియోగదారులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఈ వెసులుబాటు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అమల్లో ఉంటుంది.

ప్రజలు ఈ వెసులుబాటును అవసరమైన మేరకు వినియోగించుకోవాలని, ఎల్‌పీజీ గ్యాస్ పంపిణీదారులకు సహకరించాలని కోరారు.