అనకాపల్లి, అక్టోబర్ 29 (ఎక్స్‌ప్రెస్ టుడే): అనకాపల్లి జిల్లాలో “అర్నాబ్” తుఫాను ప్రభావం నేపథ్యంలో వివిధ శాఖలకు కేటాయించిన ముందస్తు నిధుల వివరాలను కలెక్టర్ తెలియజేశారు.

ఎస్పీ రూ.5 లక్షలు. ఈఈ, రోడ్లు మరియు భవనాలు రూ.20 లక్షలు. జిల్లా అగ్నిమాపక అధికారి రూ.5 లక్షలు. ఈఈ, గ్రామీణ నీటి సరఫరాకు రూ.5 లక్షలు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి రూ.5 లక్షలు. జిల్లా మత్స్యశాఖ అధికారికి రూ.2 లక్షలు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రూ.1 లక్ష. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి రూ.50 వేలు.

24 మంది ఎంపీడీవోలు (ఒక్కొక్కరికి రూ.1.00 లక్ష చొప్పున) రూ.24 లక్షలు. 24 మంది తహశీల్దార్లకు రూ.86 లక్షలు. ముగ్గురు ఆర్డీవోలకు కలిపి రూ.21 లక్షలు. ఈఈ, నీటిపారుదల శాఖ (చోడవరం & నర్సీపట్నం, రూ.5.00 లక్షలు చొప్పున) రూ.10 లక్షలు. ఈఈ, పంచాయతీ రాజ్ (అనకాపల్లి & నర్సీపట్నం, రూ.5.00 లక్షలు చొప్పున): రూ.10 లక్షలు.

జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్తకు రూ.3 లక్షలు. ఏరియా ఆసుపత్రి, నర్సీపట్నంనకు రూ.2 లక్షలు. అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHCs, ఒక్కోదానికి రూ.50,000 చొప్పున): రూ.3 లక్షలు. కలెక్టరేట్, అనకాపల్లికి రూ.3 లక్షలు.

మొత్తం రూ.2,05,50,000 (రెండు కోట్ల ఐదు లక్షల యాభై వేల రూపాయలు) తుఫాను సహాయ చర్యల కోసం ముందస్తు నిధులు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు.