అమరావతి, నవంబర్ 4 (ఎక్స్ప్రెస్ టుడే): ముఖ్యమంత్రి సహాయ నిధికి అమరావతిలోని వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూ. 1 కోటి విరాళాన్ని అందజేసింది. ఆ సంస్థ చైర్మన్ జి. విశ్వనాథన్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాన్ని అందజేశారు.
అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని... తుఫాను బాధితులకు సహకారం అందించేలా వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ విరాళాన్ని అందిస్తున్నట్టు వివరించారు. విరాళం ఇచ్చిన విట్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు.
