అమరావతి, అక్టోబర్ 16 (ఎక్స్‌ప్రెస్ టుడే): సత్యసాయి జిల్లాలో ఐదుగురు మహిళల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గొల్లపల్లి జలాశయంలో మునిగి పుష్పలత, గాయత్రమ్మ, అశ్విని, షేక్ హసీనా, అత్తర్ మాహీ అనే ఐదుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఘటనపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను చూసేందుకు వెళ్లి జారి పడ్డారని, మత్స్యకారులు గుర్తించి మృతులను బయటకు తీశారని అధికారులు సీఎంకు వివరించారు. మృతులంతా పెనుకొండ మండలం దుర్గాపేట వాసులు అని తెలిపారు.