పోషణ మాసం–2026 కార్యక్రమాల్లో భాగంగా అనకాపల్లి కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోషణ మాసం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, 'మన అంగన్‌వాడీ – మన బాధ్యత' అనే నినాదంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు.

  • సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా పోషణ మాసం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచన
  • గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య పరిరక్షణ, బాలల వికాసం, రక్తహీనత నివారణపై అవగాహన కార్యక్రమాలు
  • అంగన్‌వాడీ కేంద్రాల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ పిలుపు
  • పోషకాహారంతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి

లబ్ధిదారులకు అవగాహన అవసరం

జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిణి యన్. సూర్యాలక్ష్మి మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్క లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.