ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం, వరుణ జపం — పాల్గొన్న కలెక్టర్ విజయ కృష్ణన్, ప్రజాప్రతినిధులు

అనకాపల్లి, అక్టోబర్ 6 (ఎక్స్‌ప్రెస్ టుడే): వరదలు లేదా కరవు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.

మంగళవారం ఉదయం ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం, వరుణ జపం ఘనంగా నిర్వహించారు.

ఈ యాగంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతబాబు, డీసీఎంఎస్ చైర్మన్ బాలాజీ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో యాళ్ల శ్రీధర్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, దేవదాయ శాఖ అధికారులు, వేద పండితులు తదితరులు పాల్గొని కలెక్టర్‌తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎండోమెంట్స్ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండి, రైతులు, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ వరుణ యాగాన్ని చేపట్టినట్లు తెలిపారు.