భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి చైల్డ్ హోమ్స్‌లో చేర్పించాలి — చైల్డ్ హెల్ప్‌లైన్ సభ్యులకు కలెక్టర్ సూచన
అనకాపల్లి, అక్టోబర్ 5 (ఎక్స్‌ప్రెస్ టుడే): అనకాపల్లి జిల్లాలో చైల్డ్ రిస్క్యూస్, చైల్డ్ అబ్యూస్, మరియు భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి చైల్డ్ హోమ్స్‌లో చేర్పించి వారికి సంరక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిది మంది సిబ్బందితో చైల్డ్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయబడింది.
సదరు సభ్యులు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్‌లైన్ సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎటువంటి చైల్డ్ ఇష్యూస్ రాకుండా పనిచేయాలని తెలిపారు.
రైల్వే స్టేషన్లు, కాంప్లెక్స్‌లలో గుర్తింపు
రైల్వే స్టేషన్ మరియు కాంప్లెక్స్‌లలో చైల్డ్ రిస్క్యూస్, చైల్డ్ అబ్యూస్, మరియు భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి, వారిని సంబంధిత చైల్డ్ హోమ్స్‌లో సంరక్షణ కల్పించడం తదితర విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. 1098 టోల్ ఫ్రీ నెంబర్‌కు వచ్చిన కాల్స్‌పై జిల్లాలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు పిల్లలపై జరగకుండా చూడాలన్నారు.
