తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని, కాంగ్రెస్ పార్టీతో పూర్వ అనుబంధం లేని వ్యక్తులు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

అభివృద్ధి పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించిన రాజగోపాల్ రెడ్డి, నిరుద్యోగ యువత, విద్యార్థుల తరఫున పోరాటం చేస్తానని ప్రకటించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులపై విధించిన నిబంధనలపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్ష విమర్శగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

మరోవైపు, నవంబర్‌లో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ క్రీడలను నిర్వహించనున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.